Telusu Kada Trailer | సిద్దుజొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నాఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
నువ్వేరోజైతే నీ ఆడదానికెళ్లి నీకన్నీళ్లు, నీ బాధ చూపిస్తావో.. ఆరోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడివవుతవ్ బ్రదర్.. ఆ కంట్రోల్ ఎప్పుడూ వాళ్లకివ్వొద్దు.. పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడ మెయింటైన్ అవ్వాలి అంటూ సిద్దు స్టైల్లో సాగుతున్న డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. ఎవరిని ప్రేమించాలి.. ఎంత ప్రేమించాలి.. ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి.. సిద్దు చెప్తున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
నిన్న చూస్తే భయమేస్తుంది అని రాగ (శ్రీనిధి శెట్టి) అంటుంటే..భయపడు అయితే అంటున్నాడు సిద్దు (వరుణ్). నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా.. ? అంజలి (రాశీఖన్నా) అడుగుతుంటే నీకు గ్యారంటీ, వారంటీలు ఇవ్వడానికి నేనేం సేల్స్‌మెన్ కాదంటున్నాడు. సినిమా ట్రయాంగిల్ స్టోరీ నేపథ్యంలో సాగనున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తుండగా.. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
తెలుసు కదా ట్రైలర్..
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!