Dil Raju | టాలీవుడ్లో సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాతల జాబితాలో టాప్‌లో ఉంటారు దిల్ రాజు. ప్రేక్షకులు, అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కిస్తూ.. ఎప్పటికపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటాడు. కాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమా తీశాడని తెలిసిందే. ఈ మూవీ కోవిడ్ టైంలో విడుదలవడంతో పరిమిత రికార్డులను సరిపెట్టుకుంది.
సాధారణ పరిస్థితుల్లో విడుదలైతే మరిన్ని ఎక్కువ వసూళ్లు, రికార్డులు నమోదు చేసేది వకీల్‌సాబ్. కాగా పవన్ కల్యాణ్ ఒకే అనడమే ఆలస్యం మరో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చేశారు దిల్ రాజు. ఇటీవలే నైజాంలో ఓజీ సినిమాను పంపిణీ చేశాడు దిల్ రాజు. నైజాం ఏరియాలో ఓజీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ ఉండటంతో వకీల్ సాబ్ లిమిటెడ్ రికార్డులకే పరిమితమైందన్న దిల్ రాజు.. నేను తప్పకుండా పవన్ కల్యాణ్‌తో మరో ప్రాజెక్టు చేస్తా అని చెప్పారు.
ఇదిలా ఉంటే దిల్ రాజు పవన్ కల్యాణ్‌తో మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారని.. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని అప్డేట్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హను రాఘవపూడి, వెంకీ అట్లూరి, పూరీ జగన్నాధ్ లాంటి దర్శకులతో సినిమా చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు.
ఇక పవన్ కల్యాణ్, దిల్ రాజుకు తొలి ప్రేమ మూవీ రోజుల నుంచి మంచి అనుబంధం ఉంది. నైజాం ఏరియాల తొలి ప్రేమను విడుదల చేయగా.. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ పోర్షన్లను పూర్తి చేశాడని సమాచారం. పవన్ కల్యాణ్ కోసం ఈ నేపథ్యంలో అభిమానులు ఇక పవన్ కల్యాణ్-దిల్ రాజు రీయూనియన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే