NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్‌ను దసరా కానుకగా ప్రకటించబోతున్నారని ఇప్పటికే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నా.
తాజాగా శ్రద్దాశ్రీనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ లుక్ విడుదల చేశారు. ఎరుపు రంగు స్లీవ్‌లెస్ టాప్ మ్యాచింగ్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ భామ ఎన్బీకే 109లో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మాన్స్టర్గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్‌లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి, దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో కలర్ ఫొటో ఫేం చాందినీ చౌదరి కీ రోల్ పోషిస్తోంది.
Team #NBK109 wishes the immensely talented @ShraddhaSrinath a very Happy Birthday! 🤩#HBDShraddhaSrinath ✨
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 #SaiSoujanya @Rishi_vorginal @KVijayKartik @NiranjanD_ND @chakrif1 @SitharaEnts… pic.twitter.com/VTIKILLngk
— Vamsi Kaka (@vamsikaka) September 29, 2024
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?