Stree 2 | బాలీవుడ్ యాక్టర్లు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజైన సీక్వెల్ ప్రాజెక్ట్ ‘స్త్రీ 2’ (Stree 2). హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి వసూళ్ల విషయంలో ట్రెండ్ సృష్టిస్తోంది.
స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డే ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించడమే కాదు.. ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే రూ.400 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. గ్లోబల్ వైడ్‌గా స్త్రీ 2 రూ.401 కోట్లు వసూలు చేసింది. వీటిలో భారత్ నుంచి రూ.342 కోట్లు వసూళ్లు రాబట్టింది.
ఇదే ట్రెండ్ కొనసాగితే అవలీలగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయినట్టేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
One astounding week of BLOCKBUSTER success! 👻😍
Thank you, audience, for your love. 🫶🏻
Book your tickets now
🔗 – https://t.co/3ELiXoLgQY#Stree2 in cinemas now.#Stree2 #Stree2SarkateKaAatank #StreeVsSarkata… pic.twitter.com/C2s1qBKeRx
— Maddockfilms (@MaddockFilms) August 22, 2024
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని