కౌలాలంపూర్: కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్‌లో పరాజయం పాలైంది. సెమీస్‌లో సింధు.. 16-21, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో పరాభవం పాలైంది.
వరుస గేమ్స్‌లో అనవసర తప్పిదాలు చేసిన తెలుగమ్మాయి.. అందుకు మూల్యం చెల్లించుకుంది. సింధుపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన వాంగ్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం కూడా ముగిసినైట్టెంది.