Stree 2 | బాలీవుడ్ యాక్టర్లు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబోలో తెరకెక్కిన సీక్వెల్ చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2). హార్రర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. స్త్రీ 2 ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ఫస్ట్ డే నుంచి నేటి వరకు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన స్త్రీ 2 ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. రెంటల్ ఫీ విధానంలో రూ.349 చెల్లించి వీక్షించే అవకాశం ఉంది. ఇక నుంచి స్త్రీ 2 చిత్రాన్ని ప్రైమ్ వినియోగదారులు ఉచితంగా చూసేయొచ్చు.
ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. రానున్న రోజుల్లో తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్ పాండే సంయుక్తంగా తెరకెక్కించారు.
స్త్రీ 2 ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించి.. ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్త్రీ 2 కేవలం 34 రోజుల్లోనే షారుక్ ఖాన్ జవాన్ (57 రోజులు) పేరు మీదున్న (రూ.582 కోట్లు) రికార్డ్‌ను బీట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
#Stree2 (Hindi) Now Streaming on @PrimeVideoIN – Available for all prime members.#OTT_Trackers pic.twitter.com/3LrPqP8oat
— OTT Trackers (@OTT_Trackers) October 10, 2024
Siva Koratala | ప్రాంఛైజీలో దేవర 3.. ఇంతకీ కొరటాల శివ ఏమన్నాడంటే..?
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!