Sharwa 36 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 36 . అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది టీం.
గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ టీం ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తూ వస్తోంది. తాజాగా దీపావళి కానుకగా మరో లుక్ విడుదల చేస్తూ టైటిల్‌ను ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. శర్వానంద్ రైడర్ గెటప్‌లో హ్యాండిల్ పట్టుకుని కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రేస్ రాజా టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తుండగా మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రన్ రాజా రన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
రేస్ రాజా టైటిల్ ఫైనల్ అయితే ఈ సారి హిట్టుపడటం ఖాయమైనట్టేనని పలువురు సినీ జనాలు చర్చించుకుంటున్నారు. Sharwa 36లో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.