శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 10, 2020 , 08:38:38

మ‌హ‌ర్షి మెమోరీస్ షేర్ చేసిన దేవి శ్రీ ప్ర‌సాద్

మ‌హ‌ర్షి మెమోరీస్ షేర్ చేసిన దేవి శ్రీ ప్ర‌సాద్

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు , పూజా హెగ్డే,అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం మ‌హ‌ర్షి. మే 9,2019న విడుద‌లైన ఈ చిత్రం శ‌నివారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా దేవి శ్రీ ప్ర‌సాద్ ఆ నాటి మెమోరీ ఒక‌టి తన ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. పాల‌పిట్ట‌లో సాంగ్ కంపోజీష‌న్ స‌మ‌యంలో మ‌హేష్ ఎలా రియాక్ట్ అయ్యార‌నేది  ఈ వీడియో ద్వారా చూపించారు.

దేవి శ్రీ ప్ర‌సాద్ స్టూడియోకి వ‌చ్చిన మహేష్‌, వంశీ పైడిప‌ల్లి.. పాల‌పిట్ల‌లో వ‌ల‌పు సాంగ్ ట్యూన్ విని ఫుల్ ఖుష్ అవ‌డాన్ని వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌హేష్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాడు. సితార‌, ఆద్య‌, గౌత‌మ్ కూడా సాంగ్‌ని వింటూ ఉత్సాహంగా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఫుల్ వైర‌ల్ అవుతుంది. 


logo