ఇండస్ట్రీలో సెట్స్ పైకి వెళ్లినట్టే వెళ్లి నిలిచిపోయిన మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు ఇండియన్ 2 (Indian 2). చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. క్రియేటివ్ డిఫరెన్సెస్, సెట్స్ లో ప్రమాదం, ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ 2పై తాజాగా వచ్చిన అప్ డేట్ మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది. కమల్‌హాసన్ (Kamal Haasan)-శంకర్ ఈ సినిమా గురించి లైకా ప్రొడక్షన్స్ తో చర్చలు జరిపారట.
అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే త్వరలోనే ఇండియా 2ను సెట్స్ పైకి తీసుకెళ్లాడట శంకర్. ప్రస్తుతం రాంచరణ్‌తో ఆర్సీ 15 (RC15) సినిమాతో బిజీగా ఉన్నాడు శంకర్ (Shankar). బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. క్రేజీ టాక్ ఏంటంటే ఇండియన్ 2, ఆర్సీ 15 ప్రాజెక్టులను ఏకకాలంలో షూట్ చేసేందుకు ప్లాన్ చేశాడట శంకర్.
ఇంతకీ ఈ న్యూస్ ఆసక్తికరంగా ఉన్నా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కాజల్‌కు కొడుకు పుట్టిన నేపథ్యంలో ఆమె స్థానంలో వేరే భామను ఎవరినైనా తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?