Hrithik Roshan | టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్పై జోనర్లో తెరకెక్కుతోంది. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్ .
కాగా గ్లోబర్ స్టార్ తారక్ హిందీ డెబ్యూ కావడంతో సినిమాపై క్యూరియాసిటీ భారీగానే ఉంది. అయితే ఇందులో మరో స్టార్ యాక్టర్ జాయిన్ అవ్వబోతున్నాడంటే ఎలా ఉంటుంది. మూవీ లవర్స్‌కు మాత్రం పండగే అని చెప్పాలి. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌటు. మరెవరో కాదు బీటౌన్ బాద్ షా షారుఖ్‌ఖాన్. ముంబై సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం షారుఖ్ ఖాన్ వార్ 2లో కామియో రోల్ చేయబోతున్నాడట. ఇదే నిజమైతే ఒకే స్క్రీన్‌పై ముగ్గురు స్టార్ యాక్టర్లను చూసేందుకు రెండు కండ్లు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే షేర్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు మేకర్స్. YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు ఇది. వార్ 2లో తారక్ నెగెటివ్ షేడ్స్‌తో సాగే స్పై రోల్లో కనిపించనున్నాడట.
EXCLUSIVE :- A never seen BOMBASTIC cameo of SRK’s Pathaan will be there in #War2 ! #SRK, #HrithikRoshan and #JrNTR will be seen sharing the same screen space which will be the Biggest HIGHLIGHT of the film 🔥🔥🔥 pic.twitter.com/suNMlEP5sG
— FILM INDUSTRY UPDATES (@gts_official_23) August 7, 2024
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!