Pathaan movie Latest Update | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ఈయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్ల గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘పఠాన్’ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటకే చిత్రం నుండి రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం డిసెంబర్ నుండి ప్రమోషన్లను జరుపనుంది. కాగా జనవరిలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు. అయితే ట్రైలర్‌కు ముందు రెండు డాన్స్ నెంబర్లను రిలీజ్ చేయనున్నారట. ఈ రెండు పాటలు సినిమాకు మరింత హైప్‌ను క్రియేట్ చేస్తాయని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్
Rashmika Mandanna | ఐటెం సాంగ్‌లో రష్మిక మందన్నా?
Hit-2 Movie | హిట్-2 సినిమా చూసి షాకైన సెన్సార్ బోర్డు..!
Dj Tillu-2 | డిజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్?