Hit-2 Movie | హిట్-2 సినిమా చూసి షాకైన సెన్సార్ బోర్డు..!
దర్శకుడు సైలేష్ తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాడు.
Censor Board Shocked | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా సైలేష్కు డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాడు. ఇక మళ్లీ రేండెళ్ళ తర్వాత హిట్-2తో మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచడానికి వస్తున్నాడు. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డ్ షాకయిందట. సీరియల్ కిల్లర్‌ను రివీల్ చేసే సీన్ చూసి సెన్సార్ సభ్యులు షాక్‌కు గురై, సైలేష్ను అభినందించారట. దీంతో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

