Rashmika Mandanna | ఐటెం సాంగ్‌లో రష్మిక మందన్నా?
సినిమాలలో వచ్చే స్పెషల్ సాంగ్స్‌కు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్‌లను రూపొందిస్తారు.
SSMB28 Movie | సినిమాలలో వచ్చే స్పెషల్ సాంగ్స్‌కు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్‌లను రూపొందిస్తారు. అయితే గతంలో ఐటెం సాంగ్స్‌లో నటించడానికి ప్రత్యేకంగా భామలు ఉండేవారు. వీళ్ళకి పారితోషికాలు కూడా భారీగానే ఇస్తుంటారు. అయితే గత పుష్కర కాలం నుండి స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి స్టార్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క పాటలో నర్తిస్తే చాలు కోటీకి పైగా పారితోషికాన్ని తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. నిర్మాతలు కూడా తమ సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తుందటే ఆ సినిమాకు రెట్టింపు క్రేజ్ వస్తుందని పారితోషికం విషయంలో వెనకాడకుండా కోట్లు ఇచ్చేస్తుంటారు.
శ్రీయాశరణ్ నుండి మొదలైన ఈ ట్రెండ్ సమంత వరకు వచ్చేసింది. కాగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్‌లో నర్తించడానికి సిద్దమైంది. ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమే మరోవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ నుంచి నార్త్ వరకు పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతుంది. అయితే తాజాగా ఈమె స్పెషల్ సాంగ్‌లో నటించడానికి ముస్తాబవుతున్నట్లు టాక్.
సూపర్ స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కృష్ణ గారి మరణంతో షూటింగ్ కాస్త లేటయ్యేలా ఉంది. ఈ లోపు మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో ఇప్పటివరకు ఐటెం పాట లేదు. మొదటి సారిగా ఈ సినిమాలో ఐటెం పాటను పెట్టనున్నారట. థమన్ కూడా అల వైకుంఠపురం రేంజ్లో ట్యూన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

