Shah Rukh Khan | ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్’ (Pathaan)తో కలెక్షన్ కోత సృష్టిస్తే. ద్వితియార్థంలో ‘జవాన్’ (Jawan)తో కలెక్షన్ల మోత మోగించారు. ఇప్పుడు ఏడాది చివర్లో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు ఈ బాలీవుడ్ బాద్షా. ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘డంకీ’ (Dunki) చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్‌కు ముందు షారుఖ్ ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఏడాదిలో వైష్ణోదేవి ఆలయాన్ని షారుఖ్ సందర్శించడం ఇది మూడోసారి.
జవాన్ చిత్రానికి ముందు గతేడాది డిసెంబర్లో షారుక్.. వైష్ణోమాతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ‘పఠాన్’ రిలీజ్‌కు ముందు కూడా ఆయన ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆగస్టులో అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మూడోసారి ‘డంకీ’ రిలీజ్‌కు ముందు కూడా షారుఖ్ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఈ చిత్రం కూడా హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
VIDEO | Bollywood actor @iamsrk visited Mata Vaishno Devi shrine earlier today. pic.twitter.com/HbjW0YczUC
— Press Trust of India (@PTI_News) December 12, 2023
షారుఖ్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’ (DUNKI). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటించింది. ఈ సినిమా ప్రభాస్ సలార్‌కు పోటిగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read..
Pakistan | పాకిస్థాన్ ఆర్మీబేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు
Mahua Moitra | మహువా 30 రోజుల్లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలి : పార్లమెంట్ హౌసింగ్ కమిటీ