సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా సినిమా శాకుంతలం (Shaakuntalam). పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టును నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ వచ్చింది. అయితే త్వరలోనే సినిమా చూడబోతున్నామని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు నిరాశ కలిగించే విషయమొకటి బయటకు వచ్చింది. ముందుగా నిర్ణయించిన తేదీకి సినిమా రావడం లేదు.
సినిమాను 3డీ ఫార్మాట్లో బెస్ట్ క్వాలిటీతో విడుదల చేయాలని ఫిక్సయింది గుణశేఖర్ టీం. ఈ నేపథ్యంలో 3డీ ఫార్మాట్ పనుల కోసం మరింత సమయం పట్టనుండటంతో రిలీజ్ ను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు పోస్ట్ ద్వారా తెలియజేశారు మేకర్స్. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.
గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం ప్రాజెక్టులో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. శాకుంతలం చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషలలో తెరకెక్కిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
We will be announcing the new release date soon!
'#𝐒𝐡𝐚𝐚𝐤𝐮𝐧𝐭𝐚𝐥𝐚𝐦 𝐀𝐥𝐬𝐨 𝐈𝐧 𝟑𝐃'.@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/5frmUzwMcN— Gunaa Teamworks (@GunaaTeamworks) September 29, 2022
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!