మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా..పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగాగ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అయింది. మరికొద్ది గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో టికెట్స్ బుకింగ్ పై ఓ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తమిళనాడులో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అజిత్, విజయ్ సినిమాలతో సమానంగా ఉన్నాయట. ఓవర్సీస్లో బుకింగ్స్ భారీ మొత్తంలో జరుగుతుండగా..తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో సినిమాకు తొలిరోజు కలెక్షన్లు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!