ప్రభాస్ (Prabhas) ఇటీవలే తన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజును కోల్పోయిన విషయం తెలిసిందే. ఆచార వ్యవహారాల ప్రకారం నిర్వహించాల్సిన కార్యక్రమాల కోసం ప్రభాస్ కుటుంబసభ్యులతో కలిసి కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరు (Mogalthooru)కు వెళ్లాడు. తాజా అప్డేట్ ప్రకారం మొగల్తూరులో ప్రభాస్ ఫ్యామిలీ కృష్ణంరాజు సంస్మరణ సభతోపాటు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ (Salaar) సినిమా షూటింగ్లో ఉండగా..పెద్ద నాన్న కోసం కార్యక్రమాల నిర్వహణకు షూటింగ్ నుంచి రెండు రోజులు బ్రేక్ తీసుకున్నాడని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ రాకను తెలుసుకున్న అభిమానులు కృష్ణంరాజు నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రభాస్ మొగల్తూరు ఫొటోలు, వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. కృతిసనన్,సైఫ్ అలీఖాన్, దేవ్దత్త నగే, సన్నీసింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కే సినిమాలో కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.
Ocean of #Prabhas fans in Mogalthuru At #Prabhas's House 🔥🔥#PrabhasAtMogalthurupic.twitter.com/HVZxxQuzet
— T W T P (@TeamTWTPOffi) September 29, 2022

Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!