Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. తారక్ టైటిల్రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 నేడు (సెప్టెంబర్ 27న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
కాగా ఇప్పుడు దేవరకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దేవర రన్‌టైం రెండు గంటల 50 నిమిషాలు. కాగా ఇప్పుడొక అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే దేవరలో 7 నిమిషాలు ట్రిమ్ చేశారట. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు నిరాశ చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ట్రిమ్ చేసింది కేవలం హిందీ వెర్షన్లో మాత్రమేనట. తెలుగు యాక్టర్లకు సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలను తొలగించినట్టు బీటౌన్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంతో జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరియమైంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్