గురువారం 04 మార్చి 2021
Cinema - Dec 04, 2020 , 10:01:43

హౌజ్‌మేట్స్ అంద‌రిని జాగ‌ర‌ణ‌చేయించిన బిగ్ బాస్

హౌజ్‌మేట్స్ అంద‌రిని జాగ‌ర‌ణ‌చేయించిన బిగ్ బాస్

టిక్కెట్ టు ఫినాల్ టాస్క్ కేవ‌లం సోహైల్‌, అఖిల్‌ల‌కే కాదు ఇంటి స‌భ్యుల అంద‌రికి ఇచ్చిన‌ట్టు అయింది. ఈ టాస్క్ వ‌ల‌న రాత్రిళ్ళు లైట్స్ ఆఫ్ చేయ‌మ‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో వారి గుండె ఆగినంత ప‌నైంది. లైట్స్ ఆఫ్ చేస్తేనే ప‌డుకోవ‌ల‌ని ఉంటుంద‌నే నియ‌మం బిగ్ బాస్‌లో ఉంది. ఈ క్ర‌మంలో అంద‌రు మేలుకువ‌తోనే ఉన్నారు. అవినాష్ ని రాత్రంతా తిర‌గ‌మ‌ని చెప్పిన‌ప్పుడు ఇలా ఎందుకు చేయ‌లేదు బిగ్ బాస్ అంటూ హారిక ప్ర‌శ్నించింది.

బిగ్ బాస్ మాటే శాసనం కావ‌డంతో హౌజ్‌మేట్స్ ఏం చేయ‌లేక బ‌య‌ట కూర్చొని టైం పాస్ చేశారు. మ‌రోవైపు సోహైల్, అఖిల్‌లు ఉయ్యాలలో కూర్చోలేక నానా తిప్ప‌లు ప‌డ్డారు. అలానే ఊగుకుంటూ బాధ‌లని మ‌న‌సులో దాచుకున్నారు. నిద్ర‌మ‌త్తు వ‌దల‌డానికి అవినాష్.. అరియానాలు కాసేపు ఉయ్యాల చుట్టూ ప‌రిగెత్తారు. అవినాష్‌ని చెడామ‌డా తిడుతూ ప‌రిగెత్తించింది అరియాని. ఇది హౌజ్‌మేట్స్‌కు మంచి వినోదాన్ని అందించింది. ఇక అఖిల్ పులిహోర కలుపుతాడ‌ని అవినాష్ అన‌డం,చంపే ఛాన్స్ వ‌స్తే అవినాష్‌ని చంపుతూ అని అఖిల్ అన‌డం వంటివి ఈ ఎపిసోడ్ హైలైట్స్. నేటి ఎపిసోడ్ లో విజేత ఎవ‌ర‌నేది తెలియ‌నుంది. ఈ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో అఖిల్ .. అభిజీత్‌ని హ‌త్తుకొని గుక్క‌పెట్టి ఏడ్చాడు. మ‌రి ఎవ‌రు విజేతగా నిలిచి ఫైన‌ల్ రేసుకు వెళ్ళార‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

VIDEOS

logo