Vishwaksen – Arjun Controversy | విశ్వక్సేన్, సీనియర్ హీరో అర్జున్ మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వక్సేన్ హీరోగా.. తన కూతురు ఐశ్వర్య హీరోయిన్గా స్వీయ దర్శకత్వంలో అర్జున్ ఒక సినిమా మొదలుపెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి మరీ చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయిన ఈ సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీనియర్ హీరో అర్జున్ స్పందించాడు. ప్రెస్‌మీట్ పెట్టి మరి యంగ్ హీరో విశ్వక్సేన్ను కడిగిపారేశాడు. 42 ఏండ్ల సినీ కెరీర్లో ఎవరి గురించి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడలేదని.. విశ్వక్ చేసిన పనికి బాధ కలిగి ఇలా మీడియా ముందుకొచ్చానని తెలిపాడు. విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదని.. ఇంత అన్ప్రొఫెషనల్నటుడిని ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చాడు.
‘ విశ్వక్సేన్కు నేను చెప్పిన కథ నచ్చింది. అతని అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ షూటింగ్‌కు సరిగ్గా రావడం లేదు. వరుసగా కాల్షీట్స్ను మారుస్తున్నాడు. ఫోన్ చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇటీవల నా దగ్గరకు వచ్చి మళ్లీ కథ చెప్పామన్నాడు. దీని తర్వాత ఈ నెల ౩వ తేదీన కూడా షూటింగ్ పెట్టుకున్నాం. ముందు రోజు రాత్రి వరకు మాట్లాడుకున్నాం. సినిమాలో తన గెటప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. పొద్దున్నే షెడ్యూల్ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పా. కానీ ఆ రోజు ఉదయం 5 గంటలకు ఐయామ్ సారీ.. ప్లీజ్ క్యాన్సిల్ షూట్ అని విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా తను స్పందించలేదు. కథ నచ్చింది.. ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన అతనికి.. ఇప్పుడేం నచ్చలేదు. సీనియర్ హీరోలు ఎంతో కమిట్మెంట్తో ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలు కూడా ఎంతో డెడికేటెడ్‌గా పనిచేస్తారు. వాళ్లకు ఏం తక్కువ. అయినా కష్టపడుతూనే ఉన్నారు. కానీ విశ్వక్ మాత్రం షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని మెసేజ్‌లు పెడతాడు. ఇంత కమిట్మెంట్ లేని నటుణ్ని ఎప్పుడూ చూడలేదు’ అని విశ్వక్సేన్పై అర్జున్ మండిపడ్డాడు. షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాడని ఫైర్ అయ్యాడు.
‘ నా ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లడం అంటే.. నా పరపతికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని అనుకున్నా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విశ్వక్‌తో సినిమా చేయాలని అనుకోవడం లేదు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, చంద్రబోస్ పాటలు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ విశ్వక్‌కు నచ్చడం లేదు. ఒక హీరోగా ఆయన సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఒక మేకర్‌గా అవి నాకు నచ్చాలి. ఈ విషయంలో చాలాసార్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించా. కానీ అతడు వినలేదు. మీకు కథ నచ్చకపోతే ఈ సినిమా చేయాల్సిందేనని ఎవరూ బలవంతం చేయరు.’ అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్‌తో మాట్లాడతానని అర్జున్ వెల్లడించారు. ఇలా మరొకరికి జరగకుండా చూడాలనే చెప్తానని.. దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని అనుకోవడం లేదని తెలిపాడు. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని.. వేరే నటుడితో ఈ సినిమా మళ్లీ మొదలుపెడతానని స్పష్టం చేశాడు.
Urvasivo Rakshasivo | రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవ్వనున్న ఊర్వశివో.. రాక్షసివో !