Vishwaksen – Arjun Controversy | సీనియర్ హీరో అర్జున్ సార్జా, యంగ్ హీరో విశ్వక్సేన్ మధ్య వివాదం మరింత సీరియస్‌గా మారింది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశ్వక్సేన్పై అర్జున్ ఫైర్ అవ్వడం.. అతను ఒక కమిట్మెంట్ లేని నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అర్జున్‌తో వివాదంపై విశ్వక్సేన్ స్పందించాడు.
కథ విషయంలో జోక్యం చేసుకోని సూచనలు చేసిన మాట వాస్తవమేనని విశ్వక్సేన్ అంగీకరించాడు. డైలాగులు, మ్యూజిక్, సాంగ్స్ విషయంలో ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులు చెప్పినా కూడా అర్జున్ అస్సలు ఒప్పుకోవడం లేదని తెలిపాడు. అంతా తాను చెప్పినట్టే నడుచుకోవాలని అంటున్నారని.. సెట్లో తన మాటకు అస్సలు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. అందుకే మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లు, రెమ్యునరేషన్ చెక్‌లు నిర్మాతల మండలికి పంపినట్లు పేర్కొన్నాడు.
విశ్వక్సేన్ కమిట్మెంట్ లేని నటుడు.. అతనితో సినిమా చేయలేను.. సీనియర్ హీరో అర్జున్ ఫైర్