Urvasivo Rakshasivo Movie in OTT | గౌరవం సినిమాతో హీరోగా మారిన అల్లు వారబ్బాయి అల్లు శిరీష్.. కమర్షియల్‌గా హిట్ అందుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో చాలా గ్యాప్ తీసుకుని ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో వచ్చాడు. సక్సెస్‌లు లేక హిట్ కోసం ఎదురుచూస్తున్న అను ఇమ్మాన్యుయెల్‌ను ఈ సినిమా కోసం నమ్ముకున్నాడు. అయితే లవ్ అండ్ రొమాంటిక్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏది బెటర్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో అల్లు శిరీష్ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఊర్వశివో.. రాక్షసివో సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఊర్వశివో.. రాక్షసివో సినిమా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఆహా, నెట్‌ఫ్లిక్స్ రెండూ ఫ్యాన్సీ డీల్‌కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒక సినిమా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలని గతంలో ఒక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు ఊర్వశివో.. రాక్షసివో సినిమా కూడా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది.
Urvasivo Rakshasivo | ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ