శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అరవింద్ అడిగారు: అను ఇమ్మాన్యూయేల్
Anu Emmanuel | కెరీర్ బిగెనింగ్ నుండి నటన ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్న, కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్.
Anu Emmanuel | కెరీర్ బిగెనింగ్ నుండి నటన ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్న, కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్. ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అనతికాలంలోనే స్టార్ హీరోలైన అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఇక ఇటీవలే ఈమె అల్లు శిరీష్‌తో కలిసి నటించిన ‘ఊర్వసివో రాక్షసివో’ మూవీ రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్, అల్లు శిరీష్‌లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో వాటిపై స్పందించింది. ఊర్వసివో రాక్షసివో సినిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్‌ను రెండు సార్లు మాత్రమే కలిసానని చెప్పింది. అంతేకాకుండా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఓ కాఫీ షాపులో శిరీష్‌ను కలిసినట్లు చెప్పింది. అయితే అలా కాఫీ షాపులో కలుసుకున్న ఫోటోలు బయటకు రావడంతో మేమిద్దరం డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారని వెల్లడించింది. అయితే ఇలాంటి రూమర్స్‌ను తను సీరియస్‌గా తీసుకోనని చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ ఈ రూమర్స్‌పై చాలా అప్సెట్ అయిందట. అంతేకాకుండా అల్లు అరవింద్ ఒకరోజు తన ఇంటికి పిలిచి శిరీష్‌తో డటింగ్ రూమార్స్ గురించి అడిగారట. దానీపై ఇద్దరు కాసేపు నవ్వుకున్నట్లు చెప్పింది.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. సునీల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

