Anu Emmanuel | నాకు అందుకే ఆఫర్లు రావడం లేదనడం కరెక్ట్ కాదు.. అను ఇమ్మాన్యుయేల్ చిట్‌చాట్
రాకేశ్ శశి దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo) నవంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనూ ఎమ్మాన్యుయేల్ మీడియాతో చిట్ చాట్ చేసింది.
అల్లు శిరీష్ (Allu Sirish)-అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo). రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనూ ఎమ్మాన్యుయేల్ మీడియాతో చిట్ చాట్ చేసింది. ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని కుటుంబసమేతంగా చూసి ఆనందించేలా ఉంటుందని చెబుతోంది అనూ ఎమ్మాన్యుయేల్ (Anu Emmanuel). సినిమా విశేషాలు అనూ ఎమ్మాన్యుయేల్ మాటల్లోనే..
సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నేను ఈ చిత్రంలో సింధు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కనిపిస్తా. సింధు తన కెరీర్‌తోపాటు ప్రేమను కూడా ఆస్వాదిస్తూ..ముందుకు సాగాలని కోరుకుంటుంది. అయితే తన జీవితమంతా ప్రేమకే పరిమితం కావడం సింధుకు ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఆమెకు శ్రీ కుమార్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. ఒక సాధారణ అబ్బాయి, కెరీర్ పై ఫోకస్ పెట్టుకున్న ఎలా ప్రేమలో పడ్డారనేది కథాంశం. విభిన్నమైన ఆలోచనలు కలిగిన హీరోహీరోయిన్ల ట్రాక్‌తో సాగుతూ నవతరానికి కనెక్ట్ అయ్యే చిత్రమిది.
ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం..?
అందుకు చాలా కారణాలున్నాయి. మొదట ఈ కథ విన్నాక డైలమాలో పడ్డా. అప్పుడే అల్లు అరవింద్ సార్‌ను కలిశాను. ఆయన ఏదైనా కొత్తగా చేయమని సలహా ఇచ్చి పూర్తి స్క్రిప్ట్‌ను నాకు అందజేశారు. నేను పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ చదవడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా ప్రేక్షకుల అభిరుచి మారింది.. వారు మంచి కంటెంట్ కోసం చూస్తున్నారు. అందుకే నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో పూర్తిస్థాయి పాత్ర పోషించాను.
అల్లు శిరీష్ టీమ్‌తో పనిచేయడం గురించి..?
నేను శిరీష్‌ను గతంలో కలవలేదు. మొదటిసారి పూజా కార్యక్రమంలో శిరీష్‌ను కలిశాను. ఆ తర్వాత ఇద్దరం మా పాత్రల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టాం. శిరీష్ మంచి కోస్టార్. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, భావోద్వేగపూరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా నిర్మాణంలో కూడా శిరీష్‌కు మంచి పట్టు ఉంది. డైరెక్టర్ రాకేష్ శశి చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తి.. ఆయనకు సినిమా తప్ప వేరే ఆలోచనలు లేవు. గీతా ఆర్ట్స్‌పై నాకున్న నమ్మకమే నేను ఈ సినిమాకు ఒప్పుకునేలా చేసింది. .
రెగ్యులర్‌గా ఆఫర్లు రావడం లేదని అనిపించిందా..?
నా కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్యతో కలిసి నటించా. నేను కేవలం పాత్రలు, బ్యానర్ గురించి ఆలోచించడం వల్లే నాకు ఆఫర్లు రావడం లేదని కరెక్ట్ కాదు. నా సినిమాలు అంత వర్కవుట్ కాలేదు.. కానీ ఓ నటిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు. కొన్ని సినిమాల ఫలితాలను చూసిన తర్వాత నన్ను నేను మార్చుకున్నా. ఒక పాత్రకు నేను సరిపోతాననుకున్నపుడు మాత్రమే ఒకే చేస్తున్నా. సక్సెస్ నా చేతుల్లో లేదు.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసురుడు చిత్రంలో నటిస్తున్నా. నా పాత్ర చాలా క్రేజీగా సాగుతుంది. దీంతోపాటు నేను ఓటీటీపై కూడా ఫోకస్ పెట్టాను. ఒక ఆఫర్ వచ్చింది. త్వరలో వివరాలు తెలియజేస్తా.
Read Also: Idhe Idhe lyrical song | తగ్గేదే లే నుంచి ఇదే ఇదే నే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్
Read Also: Anu Emmanuel |Nivetha Thomas | మీ ప్రేమాభినాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నివేదా థామస్
Read Also: Avatar-2 Trailer | విజువల్ వండర్ అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

