Balakrishna – Meena Kiss Scene | సినిమాలతోనే కాదు టాక్ షోలతో కూడా దూసుకెళ్తున్నాడు బాలకృష్ణ. ఆహా ( Aha ) ఓటీటీ ( OTT ) ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ అవుతున్న అన్‌స్టాపబుల్ ( Unstoppable ) 2 సీజన్లో యంగ్ హీరోలతో కలిసి హంగామా చేస్తున్నాడు. రెండో ఎపిసోడ్లో విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి హంగామా చేసిన బాలయ్య.. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో శర్వానంద్, అడవి శేష్‌తో కలిసి అల్లరి చేశాడు. హీరోయిన్లతో ముద్దు సీన్లు చేయడంపై కుర్ర హీరోలను కాసేపు ఆటపట్టించాడు. ఆ తర్వాత తన కెరీర్లో కిస్ సీన్ చేసేటప్పుడు ఎదురైన ఫన్నీ సన్నివేశం గురించి చెప్పుకొచ్చాడు.
అన్‌స్టాపబుల్ షోలో రాపిడ్ ఫైర్‌లో భాగంగా శర్వానంద్, అడవి శేష్‌ను ఆడుకున్నాడు. ముందుగా ఫస్ట్ కిస్ చేసిన హీరోయిన్ ఎవరో చెప్పాలంటూ అడవి శేష్‌ను ఇరకాటంలో పడేశాడు. దానికి క్షణం సినిమాలో ఆదాశర్మ అంటూ అడవిశేష్ చెప్పుకొచ్చాడు. మరి చివరి కిస్ ఎవరు అనగానే.. ఏ మాత్రం తడముకోకుండా మీనాక్షి చౌదరి అని తెలిపాడు. మరి ఏ హీరోయిన్ను ముద్దుపెట్టుకోవాలని అనుకుంటున్నావని అడగ్గా.. కత్రినా కైఫ్ అంటూ బదులిచ్చాడు. మరి ఏ హీరోయిన్‌తో కిస్ వద్దురా బాబూ అని అనుకుంటున్నావ్ అనగానే.. కాస్త ఆలోచించి ఆలియా భట్ అంటూ అడవి శేష్ చెప్పాడు. వెంటనే శర్వానంద్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అప్పుడు మొన్నే కదా పెళ్లయింది అంటూ కవర్ చేసుకున్నాడు. దానికి మళ్లీ వెంటనే శర్వానంద్ కౌంటర్ వేశాడు. ఏంటి.. కత్రినా కైఫ్‌కి పెళ్లి కాలేదా అని ప్రశ్నించాడు. ఈ కుర్రహీరోల ఫన్నీ ఫైట్‌లోకి ఎంటరైన బాలయ్య.. నువ్వు చాలా ఫీలైపోతున్నట్టున్నవ్ కదా.. నువ్వు ఎవరికిస్తావమ్మా అంటూ శర్వాను అడిగాడు. దానికి నేను ఏ అమ్మాయి ఇస్తానన్న వద్దను సర్ అని శర్వా నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలోనే కిస్ సీన్ విషయంలో మీనాతో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ను బాలయ్య షేర్ చేసుకున్నాడు.
బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను బాలయ్య వివరించాడు. బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ వేమూరి గుట్టపై జరిగింది. ఆ పక్కనే రజినీకాంత్, మీనా సినిమా షూటింగ్ జరుగుతుండటంతో వాళ్లు తన సినిమా ఓపెనింగ్‌కు వచ్చారని గుర్తు చేసుకున్నాడు. బొబ్బిలి సింహం సినిమాలో మీనా కూడా ఒక హీరోయిన్. అందుకే ఆమె బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్‌కు హాజరైంది. ఫస్ట్ సీన్లో బాలయ్యది సీరియస్ డైలాగ్ ఉంది. బాలయ్య డైలాగ్ చెప్పడం అయిపోగానే ఔట్ ఫీల్డ్ నుంచి మీనా వచ్చి బుగ్గపై ముద్దుపెట్టాలి. రజినీకాంత్ క్లాప్ కొట్టాడు. బాలయ్య డైలాగ్ చెప్పడం అయిపోయింది. ఔట్‌ఫీల్డ్ నుంచి మీనా రావాలి. కానీ ఆమె రావడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఏంటి ఇంకా హీరోయిన్ రావడం లేదని అటువైపు తిరిగాడు. ఇంతలో మీనా.. బాలయ్య దగ్గరివరకు వచ్చేసింది. ఇద్దరి పెదాలు దగ్గరికి వచ్చేశాయి. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురైన మీనా.. కెవ్వుమని అరిచింది. అది చూసి అంతా షాకయ్యారు. ఈ విషయాన్ని అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య సరదాగా చెప్పుకొచ్చాడు.
BB4 | బోయపాటితో నాలుగోసారి బాలకృష్ణ సై.. ఈసారి మామూలుగా ఉండదు!!”