NTR and Krishna | సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య అప్పట్లో గొడవలు ఉండేవని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో వీరి మధ్య విబేధాలు మొదలయ్యాయని.. అప్పట్నుంచి వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై క్లారిటీ మాత్రం లేదు. అయితే తాజాగా ఈ వివాదంపై మహేశ్‌బాబు స్పందించాడు. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా వచ్చిన ఆయన.. ఎన్టీఆర్, కృష్ణ మధ్య గొడవపై ఒక క్లారిటీ ఇచ్చాడు.
సాధారణంగా మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడు మహేశ్. అలాంటి హీరోను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాడు బాలయ్య. ఏంటి అయ్యా.. అదయ్యా.. ఇదయ్యా అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆయన నుంచి రాబట్టాల్సిన సమాధానాలు మొత్తం రాబట్టాడు బాలకృష్ణ. తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాల గురించి మహేశ్‌బాబును అడిగాడు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య జరిగిన గొడవలపై కూడా ప్రశ్నించాడు. తమ ఇద్దరి తండ్రుల మధ్య ఉన్న రిలేషన్ గురించి ఫ్యాన్స్‌కు అర్థమయ్యేలా చెప్పాలని బాలయ్య ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు కూడా మనసులో మాట బయటపెట్టాడు.
కృష్ణ, ఎన్టీఆర్ మధ్య అప్పట్లో గొడవలు ఉన్నాయనే విషయం అబద్ధం అని క్లారిటీ ఇచ్చాడు మహేశ్‌బాబు. నిజానికి తన తండ్రి కృష్ణ కూడా రామారావు అభిమాని అంటూ చెప్పుకొచ్చాడు. ఆయనను చూసి సినిమాల్లోకి వచ్చాడని క్లారిటీ ఇచ్చాడు మహేశ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్టీఆర్‌ను కలిసినిప్పుడు నాన్న పడిన సంతోషం అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చాడు. అలాంటి ఇద్దరి మధ్య అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో గొడవ మొదలైందని ఓ ప్రచారం ఉంది. నిజానికి ఆ సినిమాను ఎన్టీఆర్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాను చేయడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి కృష్ణ, ఎన్టీఆర్ మధ్య కొన్నేండ్లపాటు మాటలు లేవని అంటారు. అయితే ఇదంతా అబద్దమని మహేశ్ బాబు చెప్పాడు.
అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన తర్వాత ఒకవేళ తాను చేసినా కూడా ఇంత బాగా చేసేవాడిని కాదని కృష్ణను ఎన్టీఆర్ మెచ్చుకున్నారని బాలయ్య టాక్ షోలో చెప్పాడు మహేశ్ బాబు. చిన్నతనంలో ఇది విన్నప్పుడల్లా బాడీలో తెలియని వైబ్రేషన్ వచ్చేదని.. నాన్న ఎంత గొప్ప నటుడు అనేది తమకు అప్పుడు అర్థమైందని అన్నాడు మహేశ్. ఎన్టీఆర్, కృష్ణ మధ్య మంచి అనుబంధం ఉండేదని.. కానీ ఎప్పుడూ వాళ్ల మధ్య గొడవ పడినట్లు ఉండేది కాదని చెప్పుకొచ్చాడు.
Read More :
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
Mahesh: మహేష్ బాబుకి ఇప్పటికీ తెలుగు చదవడం రాదట..!”
ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అన్నింట్లోనూ ఫస్ట్..సాక్ష్యాలు ఇవే”