Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?
Puri Jagannadh Next Movie | 'లైగర్' తర్వాత పూరి జగన్నాథ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆ సినిమా విజయం సాధించి ఉంటే కచ్చితంగా ఈ రోజు పూరీ రేంజ్ మరోలా ఉండేది. పాన్ ఇండియా దర్శకుడు అంటూ ఒక ముద్రపడేది.
Puri Jagannadh Next Movie | ‘లైగర్’ తర్వాత పూరి జగన్నాథ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆ సినిమా విజయం సాధించి ఉంటే కచ్చితంగా ఈ రోజు పూరీ రేంజ్ మరోలా ఉండేది. పాన్ ఇండియా దర్శకుడు అంటూ ఒక ముద్రపడేది. అయితే ఊహించని విధంగా లైగర్ దారుణంగా డిజాస్టర్ కావడంతో.. నెక్స్ట్ ఏంటి అని తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయాడు. దానికి తోడు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి కూడా పూరిని బాగా ఇబ్బంది పెడుతుంది. దీని మీద ఆయన బయ్యర్లతో గొడవ కూడా పెట్టుకున్నాడు. హిట్ సినిమా వచ్చినప్పుడు దానికి వచ్చే లాభాలను డిస్ట్రిబ్యూటర్ల నుంచి వెనక్కి తెచ్చుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డానని.. అదే ఒక్క ఫ్లాప్ వస్తే మాత్రం తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు పూరి జగన్నాథ్.
ఇదంతా ఇలా ఉంటే ఈయన నెక్స్ట్ సినిమా ఏంటి అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ దేవరకొండతో మొదలుపెట్టిన ‘జనగణమన’ మధ్యలోనే ఆగిపోయింది. లైగర్ ఫలితం చూసిన తర్వాత.. ఇప్పుడు ఆ సినిమా పూరితో చేయడం కరెక్ట్ కాదు అని భావిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు రౌడీ బాయ్. మరోవైపు పూరి మాత్రం ముంబైలోనే ఉంటూ బాలీవుడ్ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే షారుక్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి హీరోలకు కథలు చెప్పాడు.. కానీ వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఈయనకు తెలుగులో ఇద్దరు హీరోల నుంచి బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. టాలీవుడ్లో బాలకృష్ణకు ఓ కథ చెప్పాడు పూరి జగన్నాథ్. అది ఆయనకు నచ్చింది కూడా. అన్ని అనుకున్నట్టు జరిగితే అనిల్ రావిపూడి తర్వాత పూరితో బాలకృష్ణ సినిమా చేయడం కన్ఫామ్.
ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కూడా.. నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. అందులో తేడా సింగ్ గా బాలయ్య క్యారెక్టర్ ను పూరి తీర్చిదిద్దిన విధానం అనిపించింది. పూరి వర్కింగ్ స్టైల్ కూడా బాలకృష్ణకు బాగా నచ్చడంతో రెండోసారి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఫిబ్రవరి నుంచి బాలకృష్ణ పూరి జగన్నాథ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బాలయ్య కాదన్నా కూడా చిరంజీవి నుంచి కూడా పూరి జగన్నాథ్ కు ఓపెన్ ఆఫర్ ఉంది. నచ్చే కథ తీసుకొస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పాడు మెగాస్టార్. సో.. ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు పూరికి టాలీవుడ్ లో ఇద్దరు సీనియర్ హీరోలు ఆఫర్ ఇచ్చారు. ఆయన చేయాల్సిందల్లా వాళ్ళిద్దరికీ నచ్చే కథ రాయడమే.
Read Also:
Liger Movie | ‘లైగర్’ స్టోరీను ముందుగా ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Project-k | ‘ప్రాజెక్ట్-k’ మరోసారి వాయిదా పడనుందా?
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
దేవుడు పిలుస్తున్నాడు.. టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

