Tollywood New Trend | దేవుడు పిలుస్తున్నాడా.. వినడానికి వింతగా ఉంది కదా..! కానీ ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్నది అదే. ఎందుకంటే మన దర్శకులు, హీరోలు ఎక్కువగా భక్తి, ముక్తి మార్గంలో వెళ్ళిపోతున్నారు. దానికి కమర్షియల్ హంగులు ఇచ్చి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలో కూడా గాడ్ కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి మనసు అటువైపు వెళుతుంది. తాజాగా సుధీర్ బాబు కొత్త సినిమా కూడా దేవుడి కాన్సెప్ట్ తోనే వస్తుంది. దీనికి ‘హారోం హర’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. జ్ఞాన సాగర్ ఈ సినిమాకు దర్శకుడు కుప్పం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది.
ఈ సినిమా కథ అంతా ఒక గుడి నేపథ్యంలోనే జరుగుతుంది. ఇందులో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈమధ్య విడుదలై సంచలనం విజయం సాధించిన ‘కాంతార’ సినిమా పూర్తిగా దేవుడు చుట్టూ తిరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ కు వణుకు పుట్టిస్తుంది. అలాగే విడుదలకు సిద్ధమైన ‘ఆదిపురుష్’.. మొన్న దీపావళికి విడుదలైన ‘రామ్ సేతు’ రెండు శ్రీరాముడు నేపథ్యంతో వచ్చిన సినిమాలే. ఇక కృష్ణతత్వం బోధిస్తూ చందు మొండేటి తెరకెక్కించిన ‘కార్తికేయ-2’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 13 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బోయపాటి శ్రీను కూడా శివోహం అంటూ ‘అఖండ’ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా కరోనా నేపథ్యంలో కూడా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా ఎక్కువగా దేవుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ మధ్య ఈ గాడ్ కాన్సెప్ట్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని అర్థమవుతుంది.
Read Also:
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
Rishab Shetty | కాంతార హిందీ రీమేక్‌పై స్పందించిన రిషబ్ శెట్టి..!
Liger Movie | ‘లైగర్’ స్టోరీను ముందుగా ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Project-k | ‘ప్రాజెక్ట్-k’ మరోసారి వాయిదా పడనుందా?