Rishab Shetty | కాంతార హిందీ రీమేక్‌పై స్పందించిన రిషబ్ శెట్టి..!
Rishab Shetty | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ టూర్లో భాగంగా ముంబయి చేరుకున్న చిత్ర హీరో రిషబ్ శెట్టి.. సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంతారపై వస్తున్న పలు విమర్శలు, సినిమా హిందీ రీమేక్ వంటి విషయాలపై ఆయన స్పందించారు.

‘‘సినిమాపై వస్తున్న విమర్శలపై ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదు. అందరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. వంద శాతం మా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఎంతలా ప్రజాదరణ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. నెగటివ్ కామెంట్స్‌కు ప్రేక్షకులే సమాధానమిస్తారు’’ అని అన్నారు.
అనంతరం కాంతార సినిమాను హిందీలో రీమేక్ చేస్తే ఏ హీరో నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు.. రిషబ్ శెట్టి సమాధానమిస్తూ… ‘‘కాంతార సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన సినిమా. ఈ చిత్రంలో పాత్రలను పోషించాలంటే అక్కడి సంస్కృతిని తెలుసుకోవాలి. హిందీ చిత్రపరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలున్నారు. వారంటే నాకు ఇష్టం. అయితే, రీమేక్‌పై నాకు పెద్దగా ఆసక్తి లేదు’’ అంటూ చొప్పుకొచ్చారు.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!