బాలకృష్ణ పేరు చెబితే ఇప్పుడు గుర్తొచ్చేది అన్‌స్టాపబుల్. ఈ షో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూపించింది. ఒక హీరోగా తెర మీద నటించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షోతో హోస్ట్‌గా మారి.. తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఆహా ప్లాట్ఫామ్లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్‌గా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. అన్ని ఎపిసోడ్స్ ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయని చెప్పేందుకు బాలకృష్ణతో ఒక వీడియో ప్లాన్ చేసింది ఆహా యాజమాన్యం.
అందులో నెవర్ హావ్ ఐ ఎవర్ అనే ఓ కాన్సెప్ట్‌తో బాలకృష్ణను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అందులో.. మీ మనవళ్లు, మనవరాళ్లు మిమ్మల్ని తాతా అని పిలిస్తే మీరు ఒప్పుకుంటారా? అని అడుగుతారు. దీంతో నోవే.. నన్ను తాతా అంటే అస్సలు ఒప్పుకోను. వాళ్లు నన్ను బాలా అని పిలవాలి అంతే.. నో గ్రాండ్‌పా.. నో తాతా అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.