Kantara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంతార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kantara Movie On OTT | ఇంకా కొన్ని చోట్ల 'కాంతార' హవానే నడుస్తుంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి కొంచెం కూడా ఆదరణ తగ్గడం లేదు. 'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్‌గా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Kantara Movie On OTT | ఇంకా కొన్ని చోట్ల ‘కాంతార’ హవానే నడుస్తుంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆదరణ తగ్గడం లేదు. ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్‌గా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసి కన్నడలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ చిత్రంలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్‌శెట్టి పర్ఫార్మెన్స్కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా కాంతార ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబర్ 18నుండి స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కూడా నవంబర్ 4నుండి కాంతార ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వాటిపై చిత్రబృందం రూమార్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది.
హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిషబ్‌కు జోడీగా సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. రూ.2 కోట్లతో హక్కులను కొనుకున్న అల్లు అరవింద్ ఇప్పటికే పది రెట్ల లాభాలను పొందాడు. ఇక ఇటీవలే ఈ చిత్రం హిందీలో రూ.50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

