Zebra | టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) నటిస్తోన్న తాజా చిత్రం జీబ్రా (Zebra). ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన తేరిమేరి సాంగ్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తేరిమేరి పాటకు ఇంప్రెస్ అవుతున్న మ్యూజిక్ లవర్స్ రీల్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పుష్ప ఫేం ధనంజయ (జాలిరెడ్డి) కీ రోల్ పోషిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన జీబ్రా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్ మరోవైపు ఫుల్ బాటిల్, గరుడ చాఫ్టర్ 1 సినిమాల్లో నటిస్తున్నాడు.
తేరిమేరి సాంగ్ రీల్స్ ..
#TeriMeri from Zebra is trending and taking over Instagram! 💗🤩
▶️ https://t.co/ZGwIRlliZc pic.twitter.com/4FKN2YjJ1D
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2024
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట