టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సర్కారు వారి పాట హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇవాళ గోవాలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టింది పరశురాం అండ్ టీం. లేటెస్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ గోవాలో స్పెషల్ సెట్ వేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలతోపాటు టాకీ పార్టును చిత్రీకరించనుంది పరశురాం బృందం.
ఇటీవలే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రషెస్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. మహేశ్ బాబు ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌లో..న్యూ డైలాగ్ డెలివరీ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్.
మైత్రీ మూవీ మేకర్స్ , జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ , 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో రాబోతుంది సర్కారు వారి పాట.
Team #SarkaruVaariPaata pumped up with the Blockbuster Response for the #BLASTER, Resumes Shoot in Goa with an Intense Fight choreographed by Ram-Laxman Masters 👊
— SarkaruVaariPaata (@SVPTheFilm) August 13, 2021
Super🌟@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/JmzNkONe06
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్