క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ కూతురు సారా (Sara Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీ కిడ్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల ఫాలోవర్లున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బీటౌన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సారా హిందీ (Bollywood)లో డెబ్యూ మూవీ చేసేందుకు రెడీ అవుతుందట.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (University College of London) నుంచి డిగ్రీ పట్టా పొందిన సారాకు ఇపుడు 24 ఏండ్లు. ఇప్పటికే నెట్టింట ఓ అంతర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్ ( International clothing brand) కు ప్రమోట్ కూడా చేస్తుంది. లండన్ లో మెడిసన్ చదివిన తర్వాత సారా మోడలింగ్ లోకి అడుగుపెట్టి..సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్ను ప్రమోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం Ajio Luxeలో అందుబాటులో ఉంటాయి. పిల్లల వైద్యురాలు అయిన తన తల్లి అంజలిని ఫాలో అవుతూ..మెడిసిన్ చదివింది సారా.
తాజా అప్ డేట్ ప్రకారం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాల్లో ఉన్నది నిజమే అయితే..త్వరలోనే బీటౌన్‌లో మరో కొత్త హీరోయిన్ను చూడొచ్చన్నమాట.సారా నటనపై చాలా ఆసక్తిగా ఉందని, దీనికోసం కొన్ని బ్రాండ్లు ఎండార్స్ చేస్తూ.. ఆమె యాక్టింగ్‌లో పాఠాలు కూడా నేర్చుకుందని సదరు మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ మరోవైపు తండ్రి సచిన్ ఫాలో అవుతూ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.