దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు (Diwali Celebrations) జరుపుకునేందుకు ముస్తాబవుతున్నారు. సెలబ్రిటీలు పండుగకు మ్యాచ్ అయ్యే వస్త్రధారణలో మెరిసిపోయేందుకు రెడీ అంటున్నారు. ట్రెండీ లుక్కైనా..సాంప్రదాయ వస్త్రధారణలో మెరువాలన్నా నా తర్వాతే ఎవరైనా అంటోంది బాలీవుడ్ (Bollywood)భామ సారా అలీఖాన్ (Sara Ali Khan). ఎప్పుడూ పొట్టిపొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చే సారా అలీఖాన్ హాట్‌హాట్‌గా అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంది. అయితే దీపావళి వచ్చేసింది..ఈ సారి నో షార్ట్ డ్రెస్సులంటూ సంప్రదాయ లుక్‌లో మెరిసిపోతుంది సారా.
మనీశ్ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్ చేసిన లెమన్ యెల్లో దుపట్టా రాయల్ బ్లూ చుడిదార్ (royal blue churidar) సెట్లో తళుక్కుమంటోంది. గోల్డ్ జెరీ వర్క్‌తో చేయబడ్డ ఎంబ్రాయిడరీ కుర్తా, బ్రాడ్ జెరీ బార్డర్ ఉన్న దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాస్ట్యూమ్స్ కు మ్యాచ్ అయ్యే ఇయర్రింగ్స్ లో మెరిసిపోతుంది.
ఆఫ్ డ్యూటీ లుక్‌లో ముదురు ఎరుపు రంగు లెహెంగా డ్రెస్, బ్లూ పంజాబీ డ్రెస్, దీపావళికి పర్ఫెక్ట్గా సరిపోయే వస్త్రధారణలో ధగధగ మెరిసిపోతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్