Santosh Sobhan | గోల్కొండ హైస్కూల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై లీడ్ రోల్లో డెబ్యూ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు సంతోష్ శోభన్. కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు సంతోష్ శోభన్. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా సంతోష్ శోభన్‌కు ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం పడటం లేదు.
ఇదిలా ఉంటే ఈ యంగ్ యాక్టర్ స్వాతిముత్యం ఫేం లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్షన్లో సినిమాకు సంతకం చేశాడు. లక్ష్మణ్ కే కృష్ణ చాలా రోజులకు సంతోష్ శోభన్‌కు సెట్టయ్యే కథాంశంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడట. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ ప్రాజెక్ట్ వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందట.
బెల్లంకొండ గణేశ్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన స్వాతిముత్యం విక్కీ డోనర్ లైన్లో సాగుతూ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సపోర్ట్‌తో సినిమా చాలా మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వగా.. భావోద్వేగపూరిత అంశాలను హ్యాండిల్ చేయడంలో లక్ష్మణ్ కే కృష్ణ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
కాగా ఇదిలా ఉంటే సంతోష్ శోభన్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. కపుల్ ఫ్రెండ్లీ, జోరుగా హుషారుగా షికారు పోదామా సినిమాలతోపాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేశాడు.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్