Vilaayath Budha | తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). గోట్, సలార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జక్కన్న, మహేశ్‌బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాతృభాష మలయాళంతోపాటు ఇతర భాషల సినిమాలు చేస్తున్నప్పుడు కథల ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తుంటాడు. పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపించేలా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కాగా ఇప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తోన్న మలయాళ థ్రిల్లర్ ప్రాజెక్ట్ విలాయత్ బుధ విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగుతోపాటు పాన్ ఇండియా భాషల్లో టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్ చూస్తే సినిమాలో చాలా సన్నివేశాలు అల్లు అర్జున నటించిన పుష్ప సినిమాను గుర్తు తెచ్చేలా ఉన్నాయి. టీజర్ కట్ చేసిన తీరు చూస్తే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు చాలా సన్నివేశాలు పుష్ప మూవీని ప్రతిబింబించేలా ఉండటం చూడొచ్చు. అంతేకాదు టీజర్లో నువ్వేమైనా పుష్ప అనుకుంటున్నవా రా.. అని పోలీసాఫీసర్ అంటుంటే.. నో తను ఇంటర్నేషనల్.. మనం లోకల్ అని అంటున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్.
2020లో మలయాళం రైటర్ జీఆర్ ఇందుగోపన్ విలాయత్ బుద్ధ అనే (మలయాళం) నవలను లాంచ్ చేశారు. ఈ నవల ఆధారంగా విలాయత్ బుద్ధ వస్తోంది. ఈ నవలకు సూపర్ క్రేజ్ రావడంతో పెద్ద సంఖ్యలో అమ్ముడైంది. ఓ స్కూల్ టీచర్ తన ఇంటి ప్రాంగణంలో అరుదైన గంధపు చెట్లను రహస్యంగా పెంచుతుంటాడు. అయితే ఓ స్మగ్లర్ కన్ను స్కూల్ టీచర్ పెంచుతున్న గంధపు చెట్లపై పడుతుంది. అయితే ఆ స్మగ్లర్ సదరు స్కూల్ టీచర్ దగ్గర చదువుకున్న మాజీ విద్యార్థి కావడం కథలో ట్విస్ట్. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్తా ఊరికి.. అక్కడి నుండి మాఫియా కనెక్ట్ అయే క్రమంలో ఎలాంటి పరిణాలు చోటుచేసుకున్నాయనేది స్టోరీ.
కథ, థీమ్ వేరే అయిప్పటికీ మొత్తానికి విలాయత్ బుద్ధ టీజర్‌ను గమనిస్తే మాత్రం చాలా సీన్లు పుష్ప ప్రాంచైజీని గుర్తుకు తెస్తాయి. మరి పృథ్విరాజ్ సుకుమారన్ పుష్పరాజ్‌ను ఫాలో అయి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాలని ప్లాన్ చేశాడా..? ఏంటీ విజువల్స్ చూసిన వాళ్లు అనుకుంటున్నారు.
విలాయత్ బుద్ధ టీజర్..
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!
Prabhas | డార్లింగ్ అభిమానులకు మాస్ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Unmukt Chand | క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవితంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్!