Kalyani Priyadarshan | మలయాళ మొట్టమొదటి ఫీ మేల్ సూపర్ హీరో సినిమాగా వచ్చి థియేటర్లను షేక్ చేస్తున్న తాజా మలయాళ ప్రాజెక్టు ‘కొత్త లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో చెన్నై భామ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) హీరోహీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది.
35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.120 కోట్లపైగా కలెక్షన్లతో దిశగా దూసుకెళ్తోంది. సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్లో కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో మాట్లాడి అందరిలో జోషి నింపింది. ఈవెంట్లో మాట్లాడుతూ..నాపై అమూల్యమైన ప్రేమ చూపించిన మొదటివాళ్లు తెలుగు ప్రేక్షకులు. అది నేనెప్పటికీ మరిచిపోలేనంది.
‘ఇన్ని రోజుల తర్వాత ఇలా మీ అందరినీ కలవడం ఆ ప్రేమను మళ్లీ మీ దగ్గరి నుంచి పొందిన ఆనందాన్ని మాట్లలో చెప్పలేను. మీరంతా లోక సినిమాను అద్బుతమైన తెలుగు సినిమాలా ఆదరిస్తున్నారు. అది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కథలు ఇంకా చాలా వచ్చాయి. మాకు ఇంత సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని’ చెప్పుకొచ్చింది. కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు స్పీచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
The love you shower on us is our true strength. ❤️
We promise to bring you many more such stories.
A big thank you to the Telugu audience for making #KothaLokah a blockbuster hit! 🙏Experience it at cinemas near you this weekend ~ Book your tickets now! 🎟️@DQsWayfarerFilm… pic.twitter.com/gXuamW7pWJ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 6, 2025
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!
Prabhas | డార్లింగ్ అభిమానులకు మాస్ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Unmukt Chand | క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవితంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్!