Sankranthiki Vasthunnam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ నటిస్తోన్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తన్నాడు. Venky Anil 3గా వస్తోన్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేశ్ లుంగీ ధరించి సీరియస్‌గా తుపాకీ పట్టుకుని ఉండగా.. ఓ వైపు ఐశ్వర్య రాజేశ్ చీరలో.. మరోవైపు మీనాక్షి చౌదరి మోడ్రన్ అవతార్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుండగా.. రేపు ప్రెస్మీట్లో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు మేకర్స్.
భారీ బడ్జెట్‌తో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే , ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
2025 #సంక్రాంతికివస్తున్నాం 🤟🏻
ఎప్పుడు వస్తున్నామో రేపు చెప్తున్నాం 😎The much awaited release date announcement of #SankranthikiVasthunam tomorrow❤🔥
Grand Press Meet with the team from 3PM onwards💥
Watch Live Here!
▶️ https://t.co/gvv2yNt8Hy pic.twitter.com/GF4TDoRF16— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2024
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!