BSS 12 | టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి BSS 12. ఈ ఏడాది జులైలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని మహేశ్ చందు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
సంయుక్తా మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమెకు పాత్రకు సంబంధించిన స్టైలిష్, ట్రెండీ లుక్ విడుదల చేశారు. సంయుక్తా మీనన్ ఇందులో సమీర పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే టీం క్లారిటీ రానుంది.
ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. సంయుక్తామీనన్ శర్వానంద్ 37లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. దియా లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
Team #BSS12 welcomes the ravishing @IamSamyuktha_ on board and wishes her a very happy birthday! ❤️🔥❤️🔥
She’s set to draw you into a magical world soon 💥💥@BSaiSreenivas #MaheshChandu @SaiShashank4u @ludheerbyreddy @Leon_James @DSivendra @KarthikaSriniva @Moonshine_Pctrs pic.twitter.com/ldC69GMJts
— Phani Kandukuri (@phanikandukuri1) September 11, 2024
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్