Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో సామ్ తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. స్ఫూర్తి కలిగించే కోట్స్‌ను షేర్ చేస్తూ.. తన తదుపరి ప్రాజెక్ట్స్, విదేశీ పర్యటనల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ఒంటరి తనం (alone)పై సామ్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని పేర్కొంది.
‘మూడు రోజులు మౌనంగా ఉన్నా. ఫోన్ లేదు. ఎవరితోనూ కమ్మూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. అతి భయంకరమైనది. కానీ, మౌనంగా ఉండటాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలానే ఒంటరిగా ఉండమన్నా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. సామ్.. కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌కు వెళ్లినట్లు ఆ పోస్టును బట్టి తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో చివరగా ‘ఖుషి’ సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్: హనీ బనీ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ Rakt Brahmand వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది.
Also Read..
Allu Arjun | ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్‌పై అల్లు అర్జున్
Odela 2 | ఇండస్ట్రీలో ఫస్ట్ టైం.. తమన్నా ఓదెల 2 అరుదైన ఫీట్..!
Rashmika Mandanna | రామ్‌చరణ్ జోడీగా రష్మిక మందన్న?