Allu Arjun | ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్‌పై అల్లు అర్జున్
The Hollywood Reporter India | ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ తన బిజినెస్‌ను ఇండియాలోకి విస్తరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా తన కార్యాకలపాలు కోనసాగిస్తున్న ఈ మ్యాగజైన్ తాజాగా ప్రింట్ ఎడిషన్‌ని తీసుకురాబోతుంది. ఇక ఈ ప్రింట్ ఎడిషన్ మ్యాగజైన్‌కి సంబంధించి తొలి సంచిక అల్లు అర్జున్ కవర్ పేజ్‌తో రాబోతుంది.
The Hollywood Reporter | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.1871 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. దీంతో అల్లు అర్జున్ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతటా పాకింది. అయితే ఈ హీరో ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లాడు. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ తన వ్యాపారన్ని ఇండియాకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) అనే పేరుతో ఇండియాలోకి రాగా.. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ కంపెనీకి ఎడిటర్‌గా పనిచేస్తుంది. అయితే ఈ మ్యాగజైన్‌కి సంబంధించి తొలి సంచికపై అల్లు అర్జున్ ఫొటో రాబోతుంది. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటోను మేకర్స్ వదిలారు. అల్లు అర్జున్ : ది రూల్ అంటూ ఈ కవర్ పేజీపై ఉండగా.. బ్లాక్ డ్రెస్‌లో స్పెషల్‌గా కనిపిస్తున్నాడు బన్నీ.
మరోవైపు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఒక్కపదం హిందీ మాట్లాడకుండా దేశాన్ని మొత్తం పుష్ప సినిమాతో రూల్ చేశాడు. సినిమాకు హద్దులు లేవని నిరూపించిన స్టార్.. అల్లు అర్జున్: ది రూల్ అంటూ మ్యాగజైన్ కవర్‌పై నిర్వహాకులు రాసుకోచ్చారు.
With Pushpa 2, a film shot in Telugu, @alluarjun has made Hindi movie history.
The Star of India, #AlluArjun is on the launch issue of #TheHollywoodReporterIndia‘s magazine.
On stands now.
Photographer: Avani Rai
Location courtesy: The Leela Hyderabad (@TheLeelaHotels) pic.twitter.com/5NJ00dJw1M
— The Hollywood Reporter India (@THRIndia_) February 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

