Rashmika Mandanna | రామ్‌చరణ్ జోడీగా రష్మిక మందన్న?
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ‘పుష్ప-2’తో గత ఏడాది పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సొగసరి తాజాగా ‘ఛావా’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఛావా’ సినిమాలో ఈ భామ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
Rashmika Mandanna | అగ్ర కథానాయిక రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ‘పుష్ప-2’తో గత ఏడాది పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సొగసరి తాజాగా ‘ఛావా’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఛావా’ సినిమాలో ఈ భామ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న తాజాగా తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌కు అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్‌చరణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టారు దర్శకుడు సుకుమార్. గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. చరణ్, రష్మిక మందన్న ఇప్పటివరకూ కలిసి నటించలేదు. దీంతో వీరిద్దరి జోడీ కొత్తగా ఉంటుందనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో కథానాయిక విషయంలో లెక్కలు మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం రష్మికకే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

