Odela 2 | ఇండస్ట్రీలో ఫస్ట్ టైం.. తమన్నా ఓదెల 2 అరుదైన ఫీట్..!
Odela 2 | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela 2). అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది.
Odela 2 | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela 2). సంపత్ నంది (Sampath Nandi) ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తోన్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా శివశక్తి లుక్ ఇప్పటికే నెట్టింట పోస్టర్లు వైరల్ అవుతున్నాయని తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది.
చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఖాతాలో అరుదైన ఫీట్ చేరనుంది. ఓదెల 2 టీజర్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో ఫిబ్రవరి 22న లాంచ్ చేయనున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో టీజర్ లాంచ్ చేసుకోబోతున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఈ లాంచ్ ఈవెంట్‌కు చిత్రయూనిట్, మేకర్స్ హాజరుకానున్నారు. మొత్తానికి దేశమంతా మహాకుంభ్ మేళావైపు చూస్తున్న నేపథ్యంలో అక్కడే టీజర్ లాంచ్ సినిమాపై అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటోంది. ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు.
కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఓదెల 2 కోసం తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
For the first time ever, a teaser launch at the Maha Khumb Mela
#Odela2 Teaser will be launched at the divine atmosphere of the Maha Khumb Mela in Prayagraj ✨🔱#Odela2Teaser out on February 22nd
Soon in cinemas nationwide.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020… pic.twitter.com/pCMWOCh7vW
— Rajasekar (@sekartweets) February 19, 2025
Read Also :
Bhairavam Theme | బెల్లంకొండ శ్రీనివాస్ ఉగ్రరూపం.. భైరవం థీమ్ సాంగ్ స్టన్నింగ్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

