Bhairavam Theme | బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం భైరవం (Bhairavam). నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కోలీవుడ్ భామ అదితీశంకర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా మేకర్స్ స్టన్నింగ్ అప్డేట్ అందించారు.
మహాశివరాత్రి సందర్భంగా పవర్ ఫుల్ భైరవం థీమ్ సాంగ్ (Bhairavam Theme)ను ఫిబ్రవరి 21న లాంచ్ చేయనున్నారు. ఈ పాటలో బెల్లంకొండ విశ్వరూపం చూపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది.
భైరవం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇకభైరవం టీజర్లో.. రాత్రి నాకొక కల వచ్చింది. చుట్టు తెగిపడిన తలలు, మొండాలు.. దూరంగా మృత్యువు తెలియని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుని వెళ్లిపోతున్న శ్రీను.. ఈ ఊరిని కాపాడటానికి వారాహి అమ్మవారు.. ఆ అమ్మగుడిని కాపాడటానికి నానమ్మ ఉండగా నాకేమవుతుందమ్మా అంటూ సాగుతున్న సన్నివేశాలు.. అమ్మవారి గుడిని కాపాడే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఇక మనోజ్ శ్రీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే కొడకా ప్రాణాలు తీస్తానంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
భైరవం టీజర్..
Let the WRATH OF SHIVA rise, and let his RAGE take over 🔱🔥
The powerful #BhairavamTheme song out on February 21st on the occasion of #MahaShivaratri ❤️🔥#Bhairavam in cinemas soon. pic.twitter.com/HIul5IhtSS
— BA Raju’s Team (@baraju_SuperHit) February 19, 2025
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?