AR murugadoss | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి SK23. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో SKxARMగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదరాసి టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్‌తో టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ మురుగదాస్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పి అభిమానులు, ఫాలోవర్లను ఖుషీ చేస్తున్నాడు. మదరాసి గురించి మాట్లాడుతూ.. గజిని జ్ఞాపకశక్తి కోల్పోవడం , తుపాకీ స్పై ఎలిమెంట్స్ చుట్టూ ఉంటాయి. మదరాసిలో శివకార్తికేయన్ పాత్రకు సంబంధించి ఒక ప్రత్యేక అంశం ఉంటుంది. త్వరలోనే అదేంటో తెలియజేస్తాం. ప్రస్తుతానికి మాత్రం అతని పాత్ర మాత్రం అసాధారణంగా ఉంటుందని చెప్పగలను.
కథ నార్తిండియా ప్రజల యాంగిల్ నుంచి మొదలవుతుంది. మదరాసి అనేది నార్తిండియన్స్.. సౌతిండియన్స్ను సూచించేందుకు ఉపయోగించే పదం. ఇటీవల కాలంలో ఈ పదం వాడకం తగ్గింది. కానీ ఈ సినిమా ఉత్తర భారతీయులు మనల్ని ఎలా చూస్తారనే నేపథ్యంలో ఉండనుంది కాబట్టి.. ఈ చిత్రానికి మదరాసి అనేది సరైన టైటిల్ అని భావించినట్టు చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని 2025 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు తెలియజేశారు మేకర్స్.
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్