Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక పలు అనారోగ్య కారణాలతో ఇటీవలే సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. అదే సమయంలో ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తోంది.
తాజాగా సమంత దుబాయ్‌లో (Dubai Event) సందడి చేసింది. అక్కడ జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌కు చాలా స్పెషల్‌గా ముస్తాబై వచ్చింది. ఎంబ్రాయిడరీ నెట్ గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. సింపుల్ మేకప్, హెయి స్టైల్‌తో తన లుక్కు మరింత అందంగా మార్చుకని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సామ్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వారందరితో సమంత ఫొటోలు, సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇక సినిమాల విషయాని కొస్తే.. టాలీవుడ్లో సమంత సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. తాను నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా గతనెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Also Read..
Prashanth Neel | ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్.!
IPL 2025 | ఆర్సీబీకి కంగ్రాట్స్ చెప్పిన మహేశ్ బాబు