Mahesh Babu – Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB తమ మొట్టమొదటి IPL ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆర్సీబీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఆర్సీబీ టైటిల్ కొట్టడంపై శుభకాంక్షలు తెలిపాడు.
నిజమైన మనసుతో… గొప్ప ఆటతీరుతో రాణించారు. 18 ఏళ్ల పట్టుదల కృషి, కల ఈరోజు సాకారం అయింది. కోహ్లీకి, RCB జట్టుకి ఈ అద్భుతమైన గెలుపుకు శుభాకాంక్షలు అంటూ మహేశ్ రాసుకోచ్చాడు.
All heart….All class….All #18. This win was written in the stars… ❤️❤️❤️
Congratulations @imVkohli and Team RCB on this historic win…👏🏻👏🏻👏🏻 pic.twitter.com/BYH2tUnpPv
— Mahesh Babu (@urstrulyMahesh) June 4, 2025