Akhil Wedding | టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని ఇంటా మరోసారి పెళ్లిబాజాలు మోగనున్న విషయం తెలిసిందే. గతేడాది నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగచైతన్య – శోభితా పెళ్లి జరుగగా.. తాజాగా అతడి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా.. జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అందజేశాడు నాగార్జున.
బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున ఉప ముఖ్యమంత్రి భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున భట్టితో కాసేపు ముచ్చటించాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Read More