Samsaptak Raja Yogam | అత్యంత శక్తివంతమైన సంసప్తక రాజ్యయోగం..! అదృష్టమంటే ఈ రాశులవారిదే..!
Samsaptak Raja Yogam | శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దేవ గురువు బృహస్పతితో రాక్షస గురువు శుక్రాచార్యుడు కలిసి సంసప్తక రాజ్యయోగం ఏర్పరచనున్నాడు. ఈ యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నది. ఈ సమయంలో పలు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపించనున్నాయి.
Samsaptak Raja Yogam | శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దేవ గురువు బృహస్పతితో రాక్షస గురువు శుక్రాచార్యుడు కలిసి సంసప్తక రాజ్యయోగం ఏర్పరచనున్నాడు. ఈ యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నది. ఈ సమయంలో పలు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపించనున్నాయి. ఈ సంవత్సరం గురువు సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా సంచరిస్తాడు. దాంతో ఒకరాశిలో దాదాపు ఆరు నెలలు మాత్రమే ఉండనున్నాడు. ఈ సంవత్సరం గురువు మిథునరాశి, కర్కాటకం తర్వాత మళ్లీ మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు.
దాంతో పలు రాశుల వారికి కొత్త అవకాశాలు, విజయాలు దక్కే అవకాశాలున్నాయి. ఈ రాజయోగం కారణంగా పలు రాశులవారికి ప్రయోజనం ఉంటుంది. వారి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. గురువు, శుక్రుడి ప్రభావంతో అదృష్టం వరించనున్నది. జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వరిస్తాయి. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆ మూడు అదృష్ట రాశులు ఏవో, ఈ సంవత్సరం వారి జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో ఓసారి తెలుసుకుందాం..!
డిసెంబర్ 5న గురువు సంచారం..
డిసెంబర్ 5న బృహస్పతి మళ్లీ మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 20న శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో, బృహస్పతి, శుక్రుడు ఒకదానికొకటి ఏడవ ఇంటి దూరంలో ఉంటారు. దాంతో సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా, ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా ప్రయోజనం పొందుతారు.
మిథునరాశి
సంసప్తక యోగం ఏర్పడడం వల్ల మిథునరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు ఉండే అవకాశాలున్నాయి. కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు అందుకుంటారు. భావోద్వేగ ఒత్తిడిని తగ్గిస్తుంది. సంబంధాలను బలోపేతం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైనా.. పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. విద్యార్థులకు ఈ సమయంలో ఎంతో కలిసి వస్తుంది. మంచి మార్కులు పొందే అవకాశాలుంటాయి. బంగారు భవిష్యత్తుకు మార్గాలు తెరుచుకుంటాయి. అవివాహితులకు పెళ్లి అయ్యే సూచనలున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులతో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. దాంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతతో పాటు సంతృప్తి కలుగుతుంది.
సింహరాశి
సంసప్తక యోగం సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో రాశివారు ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తారు. చేపట్టిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రేమ సంబంధాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రేమ బంధాలను బలోపేతమవుతాయి. ఆకస్మిక ధనలాభం, ఏదైనా ఆర్థిక ఒప్పందం ప్రయోజనం చేకూరుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి. ఇది కుటుంబంలో ఆనందం, శాంతిని కాపాడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పిల్లల విషయంలో కూడా సంతృప్తిగా ఉంటారు. దాంతో మొత్తం కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.
తుల
ఈ సంసప్తక యోగం తుల రాశి వారికి కలిసి వస్తుంది. పూర్వీకుల ఆస్తిని తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం.. లేదంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అదృష్టంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ రాశివారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. మనస్సు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. దాంతో దేవాలయాలను సందర్శించే అవకాశాలుంటాయి. మానసిక ప్రశాంతతో చేకూరుతుంది. తుల రాశివారికి ఈ రాజయోగం పురోగతి, శ్రేయస్సు, శాంతిని ఇస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

